గుడివాడ పట్టణంలో 1వ వార్డులో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకు రూ. 39, 000 తల్లికి వందనం నగదు బ్యాంకు ఖాతాలోకి జమ అవ్వడంతో పిల్లల తల్లులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే వార్డుకు చెందిన పలువురు పిల్లలకు తల్లికి వందనం నగదు జమ అయ్యింది. ఈ సందర్భంగా పిల్లలు తల్లులు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు శనివారం కృతజ్ఞతలు తెలిపారు.