గుడివాడ: కోడిపేగులు వ్యర్ధాల వాహనాలు సీజ్

62చూసినవారు
గుడివాడ: కోడిపేగులు వ్యర్ధాల వాహనాలు సీజ్
కోడిపేగులు వ్యర్ధాలను సరఫరా చేస్తున్న నాలుగు వాహనాలను మంగళవారం నందివాడ ఎస్ఐ కె. శ్రీనివాస్ సీజ్ చేశారు. కోళ్ల వ్యర్ధాల వాహనాలపై నిఘా పెట్టగా మంగళవారం కుదరవల్లి శివారుల్లో నాలుగు ఐసర్ వాహనాల్లో వ్యర్ధాలు తరలిస్తుండగా సిబ్బందితో కలిసి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమాచారం సంబంధిత నందివాడ తహసీల్దారి గురుమూర్తి రెడ్డి అందించి వారి సమక్షంలో పట్టుబడిన వ్యర్ధాల వాహనాలను నాశనం చేశారు.

సంబంధిత పోస్ట్