గుడివాడలో బుధవారం కురిసిన వర్షానికి టిడ్కో కాలనీలో ఓ ఇంటి స్లాబ్, గోడకి క్రాక్స్ ఏర్పడి, వాటర్ లీక్ అవుతుందని ఇంటిలో నివసించే ప్రజలు గురువారం వాపోయారు. ఒక సంవత్సరం నుండి నివాసితులు ఈ ఇంటిలో నివసిస్తున్నారు. అప్పుడే క్రాక్స్ రావడంతో నివాసితులు ఆశ్చర్యానికి గురయ్యారు. అధికారుల వెంటనే స్పందించి ఇంటికి క్రాక్స్ ఏర్పడిన చోట మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరుతున్నారు.