గుడివాడ: కూలిన కల్వర్టుతో పొంచి ఉన్న ప్రమాదం

67చూసినవారు
గుడివాడ: కూలిన కల్వర్టుతో పొంచి ఉన్న ప్రమాదం
పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిపై బిళ్లపాడు శివారు చిన ఎరుకపాడు దగ్గర మురుగు కాలువపై ఉన్న కల్వర్టు కొద్ది రోజుల క్రితమే కూలిపోయింది. అయినా మిగిలిన వంతెనపై నుంచి భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ స్థలంలో బాక్సు కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు రహదారుల శాఖ ఏఈ శరత్ చంద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్