తుఫాను వేళ రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లోని రైతన్నలకు అధికార యంత్రాంగం ముందస్తు సహాయ చర్యలు అందించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. బుధవారం గుడివాడలోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే రాము సమావేశం అయ్యారు. గ్రామాల్లో ఏ మేరకు కోతలు జరిగాయి కల్లాల్లో ఎంత ధాన్యం ఉంది అన్న వివరాలను అధికారులను ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు.