రాబోవు ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక ప్రజల నుండి వచ్చిన అర్జీ విజ్ఞప్తి మేరకు గుడివాడ సాయి నగర్ లో ఎమ్మెల్యే రాము మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే రాముకు వివరించారు. కాలనీ ఏర్పడి 35 ఏళ్లు గడిచిన నేటివరకు రోడ్లు వెయ్యలేదని స్థానికులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు.