గుడివాడ 11వ వార్డులో గత కొంతకాలంగా విద్యుత్ లైన్ల వైర్లు మరియు స్తంభాల వలన స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే వెంటనే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు వారికి ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం సిబ్బంది వార్డులోని విద్యుత్ వైర్ల సమస్యలు మరియు కరెంటు స్తంభాల సమస్యలను సరి చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.