గుడివాడ: ఆరుగురు మృతి చెందడం బాధాకరం

69చూసినవారు
గుడివాడ: ఆరుగురు మృతి చెందడం బాధాకరం
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం గుడివాడ స్థానిక భయ్యా వారి వీధిలోని ఆయన కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం, టీటీడీ బోర్డు అసమర్థత వల్లే తొక్కిసలాట ప్రమాదం జరిగిందని మండలి హనుమంతరావు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్