ఇతర జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో ధాన్యం విక్రయాలు జరిగేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులందరూ రైతన్నలకు అండగా ఉంటామని కోతకోసిన ఏ ఒక్క రైతు ఆందోళన చెందనవసరం లేదని ప్రతి ఒక్కరి ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతన్నలకు భరోసా ఇచ్చారు.