గుడివాడ మండలంలో రూ.1.09కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రిబ్బన్ కట్ చేసి బుధవారం ప్రారంభించారు. కూటమి ఐదేళ్ల పాలనలో కష్టపడి పని చేసి వైసీపీ హయాంలో నష్టపోయిన ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ మండల అధ్యక్షుడు వాసే మురళీ తదితరులు పాల్గొన్నారు.