గుడివాడ: రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

50చూసినవారు
గుడివాడ-కంకిపాడు రోడ్డులోని చంద్రయ్య డ్రైన్ పరివాహక పంట పొలాల్లో ఎమ్మెల్యే రాము శుక్రవారం పర్యటించారు. పెదఎరుకపాడు, బేతవోలు పరివాహక రైతులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రయ్య డ్రైన్ కట్ట పటిష్ఠంగా లేకపోవడంతో వరదలు వచ్చిన ప్రతిసారీ గండ్లు పడి పంటలు మునుగుతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్