గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధురాలిని తన వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించి వేగంగా వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకున్నారు. గుడివాడ మండలం బొమ్ములూరులో శుక్రవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో వాహనంపై ఉన్న అచ్చమ్మ అనే వృద్ధురాలు కింద పడింది. గాయాలతో ఉన్న వృద్ధురాలి పరిస్థితిని చూసి ఎమ్మెల్యే తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేసి ఆస్పత్రికి తరలించారు.