గుడివాడ టూ టౌన్ పరిధిలోని ఎన్జీవో హోమ్లో జరిగిన వివాదం పై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. దనియాలపేటకు చెందిన మచ్చా హరిని గంటా అజయ్ ఫోన్ చేసి గొడవ జరుగుతోందని పిలిచాడు. హరి, రాజేష్ కలిసి అక్కడికి వెళ్లారు. గొడవను ఆపేందుకు హరి ప్రయత్నించగా, వెంకన్న కుర్చీతో తలపై కొట్టినట్టు ఫిర్యాదు చేశాడు. మరోవైపు హరి, రాజేష్ కలిసి తనపై దాడి చేశారని వెంకన్న ఫిర్యాదు చేశాడు. హోమ్ కుర్చీలు పాడయ్యాయని షామియానా యజమాని మహేష్ కూడా ఫిర్యాదు చేశాడు.