గుడివాడ రూరల్ మల్లయిపాలెంలోని శ్రీకాళహస్తి కాలనీ వాసులు సచివాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము హామీ ఇచ్చిన విధంగా కాలనీ ప్రజలకు పైపుల ద్వారా మంచినీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి పన్ను, కరెంట్ బిల్లు ఉన్న ప్రతి ఒక్కరికి రూపాయికి ఉచితంగా రిజిస్టేషన్ చేయాలని, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను ఉండి కాపురం ఉంటున్న ప్రతి ఒక్కరికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు.