గుడివాడలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి 15వ వార్డులో రోడ్లపై వర్షపు నీరు చేరింది. మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యంలో రోడ్లపై నిలిచిన వర్షపు నీరును గల్ఫర్ మిషన్ తో బుధవారం తొలగించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ జహీర్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.