గుడివాడ: రహదారులు అభివృద్ధికి రూ. 7. 50 కోట్లు మంజూరు

78చూసినవారు
గుడివాడ: రహదారులు అభివృద్ధికి రూ. 7. 50 కోట్లు మంజూరు
గుడివాడ నియోజకవర్గంలో ఆర్ & బి రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7. 50 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై గుడివాడ ప్రజావేదికలో ఎమ్మెల్యే రాము అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 6. 53 కోట్లతో మంజూరైన 15 వర్కుల్లో ఆరు వర్కులు పూర్తయినట్లు అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలియచేశారు.

సంబంధిత పోస్ట్