గుడివాడ: ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డు ఏర్పాటు చేయాలి

66చూసినవారు
గుడివాడ: ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డు ఏర్పాటు చేయాలి
గుడివాడలోని విద్యా, వైద్య, పోలీసు మున్సిపల్ కార్యాలయాలలో ఆర్టీఐ బోర్డు ఏర్పాటు చేయాలని న్యాయవాది హేమంత్ కుమార్ అల్లూరి గురువారం అన్నారు. ప్రస్తుత కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డులన్నీ సక్రమంగా లేవని, ఈ నేపథ్యంలో సమాజంలో ప్రజలు సమాచారం పొందే హక్కును సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. ఫోన్ నెంబర్, ఈమెయిల్ సమాచారం హక్కు బోర్డుపై ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్