గుడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు కొత్తగా ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నాగరాజు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. గుడివాడ పట్టణంలో వృద్ధి చెందుతున్న ట్రాఫిక్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, నగర ట్రాఫిక్ నిర్వహణలో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలన్నారు.