నందివాడ మండలం తమిరిశ గ్రామ సర్పంచ్ తప్పిట. ధనలక్ష్మి కుల ధ్రువీకరణ పై శుక్రవారం విచారణ నిర్వహించనున్నట్లు ఈ వో పీ ఆర్డీ భాష వెల్లడించారు. 2020 - 2021 సాధారణ ఎన్నికల్లో తమిరిశ సర్పంచ్ గా ఎస్సీ మహిళాకు రిజ్వర్ చేశారు. వైకాపా మద్దత్తుతో ధనలక్ష్మి పోటీ చేసి గెలిచారు. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారని ప్రత్యర్థి అభ్యర్థి కారే. వెంకట రమణ పంచాయతీ రాజ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు.