గుడివాడ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ. 20 సంవత్సరాలుగా గుడివాడ వెనుకబడిపోయి, అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. ప్రధానంగా మంచినీరు, రోడ్ల సమస్య, వీధిలైట్ల సమస్యలు ఉన్నాయన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.