గుడివాడ నియోజకవర్గ పరిధిలోని కార్మిక వర్గాల సంక్షేమానికి తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. సోమవారం గుడివాడ పట్టణంలో మీ కోసం మీ వెనిగండ్ల పర్యటనను ఎమ్మెల్యే రాము నిర్వహించారు. పట్టణంలోని సత్యనారాయణపురం, గౌరీ శంకరపురంలో ఎమ్మెల్యే రాము తన పర్యటన నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలపై స్థానికులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు.