ఈ నెల 25వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే భవన నిర్మాణ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కృష్ణా జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం ఉపాధ్యక్షుడు రేపాని కొండ అన్నారు. గుడివాడలో నిర్వహించిన సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల ఇళ్లను ముట్టడించిన కార్మికుల సమస్యల గురించి ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. కార్మికులను ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.