ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా రోటరీ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాలడుగు నిశాలి మాట్లాడారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడం ద్వారా సరైన చికిత్స పొంది, ఉపశమనం పొందవచ్చన్నారు. మంచి ఆహారపు అలవాట్లతో, వ్యాయామంతో యువత క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలన్నారు.