గుడివాడలో యువకుడిపై కత్తితో దాడి

62చూసినవారు
గుడివాడలో యువకుడిపై కత్తితో దాడి
యువకుడిపై కత్తితో దాడి జరిగిన సంఘటన కృష్ణా జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గుడివాడ మార్కెట్ సెంటర్లో పుప్పాల పవన్ అనే యువకుడు పాత గొడవలు నేపధ్యంలో మాంసం కొట్టే కత్తితో సిరిగిడి శ్రీనుపై దాడి చేశాడు.
శ్రీను ఎడమ చేతికి, వీపు మీద తీవ్ర గాయాలు అయ్యాయి. దీనితో మార్కెట్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. గాయపడిన శ్రీనును గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్