గుడివాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారుల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అధికారులతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. బుధవారం గుడివాడలోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో ఆర్డీవో బాలసుబ్రమణ్యంతో కలిసి నేషనల్ హైవే అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు.