పండ్ల వ్యాపారులు రోడ్ మార్జిన్ దాటి ముందుకు వస్తే సహించేది లేదని గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనిగండ్ల రాము హెచ్చరించారు. బుధవారం గుడివాడ పట్టణంలో మార్కెట్ సెంటర్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే విధంగా తోపుడు బండ్లు రోడ్డు మీద పెడితే పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు.