యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా ఆసక్తి చూపాలని, సన్మార్గంలో ముందుకు సాగితేనే యువతరానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో కొమ్మలపాటి సాయి మెమోరియల్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఫైనల్ పోటీలో విజయం సాధించిన అంగులూరు , రన్నరప్ గా నిలిచిన చంద్రాల జట్లకు నగదు బహుమతులను ఎమ్మెల్యే రాము సోమవారం అందజేశారు.