గుడ్లవల్లేరు, కూరాడ, విన్నకోట, కౌతవరం, వేమవరం, వడ్లమన్నాడు, దగ్గుమిల్లి, తాడిచర్ల, చినగొన్నూరు గ్రామాల్లో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. కేవలం 3 గంటల్లో 16. 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన, అంతర్గత రహదారులు నీటమునిగాయి. ముదినేపల్లి ప్రధాన రహదారిలో విన్నకోట వద్ద కాల్వను తలపించేలా నీరు ప్రవహించింది. కౌతవరం ఒకటో వార్డులో పలు వీధులు, ఇళ్లు నీట మునిగాయి.