మాజీ మంత్రి కొడాలి నాని శనివారం గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు హాజరై షరతుల మేరకు సంతకం చేశారు. ఇటీవల ఓ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. నానితో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు స్టేషన్ వరకు వెళ్లి మద్దతుగా నిలిచారు. అనంతరం ఆయన రాజేంద్రనగర్‌లోని స్వగృహానికి చేరుకుని పార్టీ నేతలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.