ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో తామంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్ ప్రాంగణంలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పొట్లూరి రవికుమార్, వైస్ చైర్మన్ గా కూనపురెడ్డి కళ్యాణకృష్ణ ఇతర సభ్యులచే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రమాణ స్వీకారం చేయించారు.