గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం మధ్యాహ్నం నందివాడ మండలంలోని దోసపాడు వంటకాలువను ద్విచక్ర వాహనంపై రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ పనుల్లో దోపిడీ చేద్దామంటే కూటమి ప్రభుత్వములో కుదరదని, ఇరిగేషన్, డ్రైనేజీ పనులను డబ్బులు తెచ్చే యంత్రాంగంగా గత ప్రభుత్వ మార్చి వేసిందని అన్నారు.