గుడివాడలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

58చూసినవారు
గుడివాడలోని 10వవార్డులో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి రమేష్ గురువారం పర్యటించారు. వార్డులో వినాయకుడి గుడి వద్ద చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కమిషనర్ ని కోరారు. కొన్నిచోట్ల వీధి దీపాలు లేవని ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, త్వరలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షేక్ సర్కార్, సుంకర వెంకట్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్