కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి అన్ని రంగాల్లో అగాధంలో ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నందివాడ మండలంలోని జనార్ధనపురం, తుమ్మలపల్లి, తమిరిశ, రుద్రపాక, ఇలపర్రు గ్రామాల్లో రూ. 2.86 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 33 బీటీ, సీసీ రోడ్లను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ప్రారంభించారు.