నందివాడ మండలం ఇలపర్రు ఇమ్మనివానిగూడెం మధ్య బుడమేరులోని రెగ్యులేటర్ల వద్ద నిషేధిత క్యాట్ ఫిష్ పెద్ద మొత్తంలో నిల్వ చేశారని ఓ వ్యక్తి అసత్య ప్రచారం చేశాడు. బుడమేరు వద్దకు వెంట తీసుకొని వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి క్యాట్ ఫిష్ నిల్వలు కనిపించలేదు. ఇది పూర్తిగా అవాస్తవం అసత్య ప్రచారమని అధికారులు తెలిపారు. క్యాట్ ఫిష్ నిల్వ చేసి ఎగుమతి, దిగుమతులు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.