కూటమి ప్రభుత్వ హయంలో గడిచిన ఏడాదికాలంగా అనేక అభివృద్ధి పనులు జరిగాయని పూర్తిస్థాయిలో గుడివాడను అభివృద్ధి చేసే వరకు తనకు సంతృప్తి ఉండదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కూటమి ప్రభుత్వ మొదటి ఏడాది విజయోత్సవ వేడుకలు గుడివాడ పట్టణంలో గురువారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని కూటమి పార్టీల శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు.