మల్లాయిపాలెంలో ట్రాఫిక్ పై అవగాహన

61చూసినవారు
గుడివాడ మండలం మల్లాయిపాలెం మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ భద్రత అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై చంటిబాబు మాట్లాడుతూ రోడ్డు మీద ప్రయాణించే ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, మద్యం సేవించకుండా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్