ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కు అపూర్వ స్వాగతం

81చూసినవారు
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కు అపూర్వ స్వాగతం
జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో తాతయ్యకు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు స్వాగతం పలికి కౌన్సిల్ హాల్ లోకి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్ లో పూల బొకే అందజేశారు. కౌన్సిల్ హాల్ లో అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లను పలకరిస్తూ ముందుకెళ్లారు.

సంబంధిత పోస్ట్