పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా ఉంటుందని జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. వత్సవాయి మండలం భీమవరానికి చెందిన వెంకటేశ్వర్లుకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన రూ. 3, 18, 212ల చెక్కును ఆదివారం సామినేని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఉపఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికే తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.