ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తిరుమలగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్ల ను భక్తులు, గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. స్వామివారి కళ్యాణనికి అయిన ఖర్చులు లెక్కలు వివరాలు ఈఓ తెలపటం లేదని కమిటీ సభ్యులు తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు ప్రతి మూడు నెలలకు ఉంటుందని (మార్చి 17జరిగింది) ఇప్పుడు లెక్కింపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈవో పై అనేక ఆరోపణలు చేశారు.