అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు

72చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెలిపారు. మంగళవారంజగ్గయ్యపేట పట్టణం 1 వ వార్డు యానాదుల కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని అర్హులైన వారందరికీ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సామినేని మనోహర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్