జగ్గయ్యపేటలో ఈనెల 19న గ్రివెన్స్ కార్యక్రమం: ఆర్డీవో

56చూసినవారు
జగ్గయ్యపేటలో ఈనెల 19న గ్రివెన్స్ కార్యక్రమం: ఆర్డీవో
జగ్గయ్యపేటలోని బి కన్వెన్షన్ హాల్లో ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఆర్డీవో బాలకృష్ణ శనివారం తెలిపారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఈ వేదిక ద్వారా తెలియజేసి పరిష్కారం పొందగలరని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్