సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ విజేత తిరపతమ్మను బుధవారం జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అభినందించారు. జగ్గయ్యపేట పట్టణం చెరువు బజారునకు చెందిన ముద్ధా తిరపతమ్మ తమిళనాడు రాష్ట్రం శేలంలో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో 63 కేజీల జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ సాధించారు. ఓవరాల్ గా స్ట్రాంగ్ ఉమెన్ గా నిలిచారు.