జగ్గయ్యపేట ఆర్ టి సి బస్ స్టాండ్ లో గురువారం నూతన సూపర్ లక్సరి బస్సు సర్వీసులను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య)చేతుల మీదగా జగ్గయ్యపేట - బెంగళూరు, అరుణాచలం సర్వీస్ లను ప్రారంభం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.