జగ్గయ్యపేట మున్సిపాలిటీ రామాలయం ఫీడర్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు ఏపీ సిపిడిసిఎల్ జగ్గయ్యపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రామాలయం ఫీడర్ పరిధిలోని ఆయా ప్రాంతాలలో గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్తు మరమ్మత్తుల పనుల వలన విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు తెలిపారు.