కళాకారులకు, సాంప్రదాయ న్యూత్యాలు, వివిధ కళలకు, కవులకు గేయాల రచయితలకు గాయకులకు శ్రీకాళ వేదిక అండగా నిలవాలని జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. శ్రీకాళ వేదిక అధ్యక్షుడు తట్టా రంగ రామానుజం నాయకత్వంలో సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ కళాకారుల కోసం ఇతర కళల ప్రదర్శనకు వేదికగా శ్రీకాళ వేదిక ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు.