ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి జూలై 9న ఉదయం 10 గంటలకు మోపిదేవి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె. వీరరవి శనివారం తెలిపారు. మచిలీపట్నం (బాలికలు), మోపిదేవి, మైలవరం, కొండపల్లి, వత్సవాయి పాఠశాలల్లో ఈ పరీక్షల ద్వారా సీట్లు భర్తీ చేయనున్నారు.