వత్సవాయి నుండి వైరాకు వెళ్లే రహదారిలో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. లారీ, ట్రాక్టర్ ను ఢీకొనడంతో తాళ్లూరు వెంకటేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెనుగొండ బాల, రాయల రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.