జగ్గయ్యపేట పట్టణంలోని జగ్గయ్యపేట నుండి ముక్త్యాల వెల్లె రోడ్డును ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మంగళవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా వరద నీటిలో ఈ బ్రిడ్జి ఇబ్బందులకు గురైనదని, రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేల మంది భక్తులు ఈ బ్రిడ్జి పైనుంచి ముక్త్యాల ప్రయాణం చేస్తూ కోటిలింగాల క్షేత్రాలకు వెళ్తారని తెలిపారు.