పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం నుంచి శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు, పరివార దేవతలు అందరూ శాకంబరీ దేవి అలంకరణలో శనివారం దర్శనం ఇవ్వనున్నారు. పండ్లు, కూరగాయలతో మహిళలు, సేవా సమితి సభ్యులు దండలుగా ఏర్పాటు చేస్తున్నారు. శాకాంబరీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రానున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.