జగ్గయ్యపేటలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది. ఆదివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య స్వయంగా ఇంటింటికి వెళ్లి, ప్రభుత్వ పథకాలను వివరించారు. చంద్రబాబు పాలనలో సంక్షేమం రెట్టింపు అయిందని ఆయన తెలిపారు. తల్లికి వందనం, దీపం, రైతు సంక్షేమం వంటి పథకాలతోపాటు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.